![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1018 లో.. రాజీవ్ కాలేజీలో ఉన్న వసుధార, మనుల ఫోటోలని కొత్త ప్రేమప్రయాణం అంటూ పోస్టర్లు అంటిస్తాడు. అ విషయం ఎలాగైనా శైలేంద్రకి చెప్పాలని ఫోన్ చేస్తుంటాడు. కానీ శైలేంద్ర నిద్రలో ఉండి ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. పోస్టర్ అంటించింది వీడియో తీసి శైలంద్ర దగ్గరికి వెళ్తాడు.
ఆ తర్వాత నిద్రలో ఉన్న శైలేంద్ర.. నా భయ్యా అంటూ రాజీవ్ లేపేసరికి అప్పుడే ధరణి నిద్ర లేస్తుంది. ధరణి ఎక్కడ చూస్తుందోనని రాజీవ్ బెడ్ కింద దాక్కుంటాడు. ఇక శైలేంద్ర కవర్ చేస్తు.. ఎవరు లేరని కాఫీ తీసుకొనిరా అని పంపిస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ ని తీసుకొని బయటకు వచ్చి.. ఎందుకు వచ్చావంటు అడుగుతాడు. పోస్టర్ అంటించిన వీడియో రాజీవ్ చూపించగానే మన ప్లాన్ సక్సెస్ అని అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్ళిపోయాక శైలేంద్ర లోపలికి వస్తాడు. చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడేం జరిగిందని ధరణి అడుగుతుంది... నీకు చెప్పిన అర్ధం కాదులే గానీ రేపు నువు నాతో పాటు కాలేజీకి రావాలి.. ఒక అద్భుతమైన సినిమా వెండితెరపై చుపిస్తానని అనగానే ధరణికి ఏం అర్ధం కాదు.
మరుసటిరోజు ఉదయం అందరు స్టూడెంట్స్ రాజీవ్ అంటించిన పోస్టర్ చూసి ఆశ్చర్యంగా చూస్తుంటారు. మరొకవైపు ధరణిని తీసుకొని శైలేంద్ర కాలేజీకి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడ వసుధార, మనుల పోస్టర్లు చూసి ధరణితో పాటు అనుపమ, మహేంద్ర షాక్ అవుతారు. అప్పుడే వసుధార వచ్చి చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇది అని వసుధార అడుగుతుంది. ఎవరో కావాలనే ఇదంతా చేశారని మహేంద్ర అంటాడు. అప్పుడే మను వచ్చి పోస్టర్ చూస్తాడు. మను ఇదేంటని అనుపమ అడుగుతుంది. నాకేం తెలియదని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |